Tenofovir disoproxil fumarate

Tenofovir disoproxil fumarate గురించి సమాచారం

Tenofovir disoproxil fumarate ఉపయోగిస్తుంది

Tenofovir disoproxil fumarateను, హెచ్ఐవి సంక్రామ్యత మరియు దీర్ఘకాలిక హెపటైటిస్ బి యొక్క చికిత్సలో ఉపయోగిస్తారు

ఎలా Tenofovir disoproxil fumarate పనిచేస్తుంది

Tenofovir disoproxil fumarate వైరస్ రెట్టించిన వేగంతో విస్తరించకుండా నిరోధించి క్రమంగా దాన్ని అంతమొందిస్తుంది.
టెనోఫోవిర్ అనేది న్యూక్లియోసైడ్ రివర్స్ ట్రాన్స్ స్క్రిప్టేజ్ ఇన్హిబిటర్స్ (NRTIs) అనే తరగతికి చెందిన యాంటీ వైరల్ మందు. దీని నిర్మాణం వైరల్ డిఎన్ఎ సహజ నిర్మాణం లాగా ఉంటుంది, ఇది దీనిని వైరల్ డిఎన్ఎలోనికి స్వయంగా పొందుపరచడంలో సహాయపడుతుంది. ఇలా చేయడం వలన, ఇది వైరస్ జీవించి ఉండడానికి ముఖ్యమైన ప్రక్రియ అయిన వైరల్ డిఎన్ఎ ప్రతికృతిలో ప్రమేయం గల ముఖ్యమైన వైరల్ ఎంజైమ్ రివర్స్ ట్రాన్స్ స్క్రిప్టేజ్ చర్యను అవరోధిస్తుంది.

Tenofovir disoproxil fumarate యొక్క సాధారణ దుష్ప్రభావాలు

డయేరియా, వాంతులు, వికారం, మైకం, బొబ్బ

Tenofovir disoproxil fumarate మెడిసిన్ అందుబాటు కోసం

  • ₹1540
    Cipla Ltd
    1 variant(s)
  • ₹1539
    Dr Reddy's Laboratories Ltd
    1 variant(s)
  • ₹1173
    Mylan Pharmaceuticals Pvt Ltd - A Viatris Company
    1 variant(s)
  • ₹1310
    Natco Pharma Ltd
    2 variant(s)
  • ₹1233
    Emcure Pharmaceuticals Ltd
    1 variant(s)
  • ₹479 to ₹1508
    Torrent Pharmaceuticals Ltd
    2 variant(s)
  • ₹1406
    Wockhardt Ltd
    1 variant(s)
  • ₹487 to ₹1540
    Hetero Drugs Ltd
    3 variant(s)
  • ₹1487
    Abbott
    1 variant(s)
  • ₹1500
    Sun Pharmaceutical Industries Ltd
    1 variant(s)

Tenofovir disoproxil fumarate నిపుణుల సలహా

  • చికిత్సలో భాగంగా తీసుకుంటోన్న ఇతర ఔషధాల్లో టెనోఫోవిర్ కలిసి ఉన్నప్పుడు ఈ ట్యాబ్లెట్ ను వాడరాదు.
  • మూత్రపిండాలపై ప్రభావం చూపించే అడేఫోవిర్ తో(హెపటైటిస్ బీ చికిత్సలో భాగంగా) పాటూ టెనోఫోవిర్ ను తీసుకోరాదు.
  • ఊపిరి తీసుకోవడంలో సమస్యలు తలెత్తినప్పుడు, వాంతులయ్యే లక్షణాలు కనిపిస్తున్నా, నీరశం ఆవరించినా, కాళ్లు, చేతులూ మొద్దుబారినట్లు ఉన్నా, కడుపు నొప్పి మొదలైనా, హృదయ స్పందన ఉన్నట్లుండి రెట్టింపు అయినా వెంటనే వైద్యుని సంప్రదించాలి. టెనోఫోవిర్ సైడ్ ఎఫెక్ట్స్ లో ఇవి ప్రాణాంతక లక్షణాలు కాగలవు. మహిళల్లో లాక్టిక్ అసిడోసిస్ సమస్య తలెత్తుతుంది. ముఖ్యంగా ఊబకాయంతో బాధపడుతున్న మహిళలు, చాలాకాలంగా న్యూక్లియోసైడ్ ను తీసుకుంటున్నవారు.
  • టెనోఫోవిర్ వల్ల మూత్రపిండాలు దెబ్బతినే అవకాశం ఉంది. కాబట్టి, క్రమం తప్పకుండా మూత్రపిండాల పనితీరును పర్యవేక్షిస్తూ ఉండాలి.
  • ఈ క్రింది లక్షణాలు కనిపించినప్పుడు వైద్యుని సంప్రదించాలి.వాంతు అయ్యేట్టు ఉన్నా, కడుపు నొప్పి, దురద, ఆకలి వేయకపోవడం, మూత్రం ముదురు రంగులోకి మారడం, మలం మట్టిరంగులోకి మారినా, కామెర్లు లక్షణాలు కనిపించినప్పుడు. ఇవన్నీ తీవ్రమైన కాలేయ సమస్యకు దారితీస్తాయి.
  • టెనోఫోవిర్ తీసుకోవడం వల్ల బోన్ మినరల్ డెన్సిటీ తగ్గిపోతోంది.
  • గర్భిణులు, గర్భం ధరించాలనుకుంటోన్న మహిళలు, చిన్నారులకు చనుబాలు ఇస్తున్న తల్లులు వెంటనే వైద్యుని సంప్రదించాలి.
  • చిన్నారులకు చనుబాలు ఇస్తున్న తల్లులు టెనోఫోవిర్ ను వాడరాదు.
  • HIV తో బాధపడుతున్న పెద్ద వయస్కుల్లో టెనోఫోవిర్ లైపో డిస్ట్రోపీని(శరీరంలోని కొవ్వు శాతంలో మార్పులు చోటుచేసుకుంటాయి. తద్వారా బరువు కోల్పోవడం జరుగుతుంది.) కలుగజేస్తుంది. కాబట్టి ఎప్పటికప్పుడు శరీర బరువును పర్యవేక్షిస్తూ ఉండాలి.
  • HIV వైరస్ ఇతరులకు వ్యాపించకుండా(శృంగారానికి ముందు ఆ తరువాత తీసుకోవాల్సి చర్యలు) ఎలాంటి సురక్షితమైన చర్యలు తీసుకోవాలో వైద్యుడిని అడిగి తెలుసుకోవాలి.